BREAKING: ములుగు సబ్‌స్టేషన్‌లో పేలిన ట్రాన్స్‌ఫార్మర్.. అంధకారంలో పది గ్రామాల ప్రజలు

by Shiva |
BREAKING: ములుగు సబ్‌స్టేషన్‌లో పేలిన ట్రాన్స్‌ఫార్మర్.. అంధకారంలో పది గ్రామాల ప్రజలు
X

దిశ, వెబ్‌డెస్క్: వేసవి కాలం కావడంతో భానుడి ప్రతాపానికి రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలోనే ములుగు సబ్‌స్టేషన్‌లో 133 కే.వీ ట్రాన్స్‌ఫార్మర్ అకస్మాత్తుగా పేలింది. దీంతో స్టేషన్ మొత్తానికి మంటలు వ్యాపించాయి. విద్యుత్ సిబ్బంది సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ పేలుడుతో దాదాపు సబ్‌స్టేషన్ పరిధిలోని 10 గ్రామాలకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఈ పరిణామంతో ఆయా గ్రామాల ప్రజలంతా అంధకారంలోనే ఉన్నారు. ప్రస్తుతం సబ్‌స్టేషన్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Advertisement

Next Story