Breaking News : రాష్ట్రంలో 40 మంది మున్సిపల్ కమిషనర్లు బదిలీ

by Sathputhe Rajesh |   ( Updated:2024-02-13 03:46:25.0  )
Breaking News : రాష్ట్రంలో 40 మంది మున్సిపల్ కమిషనర్లు బదిలీ
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్రంలో అధికారుల బదిలీలు హాట్ టాపిక్‌గా మారాయి. సోమవారం ప్రభుత్వం 105 మంది పంచాయతీ రాజ్ సిబ్బందిని బదిలీ చేసింది. 105 మదిలో సీఈవో, డీఆర్డీవో, అడిషనల్ డీఆర్డీవో, డీపీవోలు ఉన్నారు. కాగా, సోమవారం రాత్రి రాష్ట్ర వ్యాప్తంగా 40 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో రేపటిలోగా రిపోర్ట్ చేయాలని మున్సిపల్ కమిషనర్లకు ప్రభుత్వం స్పష్టం చేసింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సొంత జిల్లాల్లో, 3 ఏళ్లకు పైగా ఒకే జిల్లాలో పనిచేస్తున్న వారిని బదిలీ చేసినట్లు ఆదేశాల్లో ప్రభుత్వం తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed