BREAKING: సింగరేణి ప్రైవేటీకరణకు కుట్ర జరుగుతోంది.. మాజీ మంత్రి కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్

by Shiva |
BREAKING: సింగరేణి ప్రైవేటీకరణకు కుట్ర జరుగుతోంది.. మాజీ మంత్రి కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: సింగరేణి గనులు దక్కకపోడవడానికి కారణం బీఆర్ఎస్, బీజేపీయేనని డిప్యూటీ సీఎం మల్లు భట్టు విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలకు కౌంటర్‌గా మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై ఉద్దేశపూర్వకంగానే సింగరేణికి గనులు కేటాయించడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే వేలంపాటలో పాల్గొనాలంటూ డిప్యూటీ సీఎం చెబుతున్నారని కౌంటర్ ఇచ్చారు. సింగరేణిని ప్రైవేటుపరం చేసేందుకే వేలంలో పాల్గొంటున్నామంటున్నారని ఫైర్ అయ్యారు. ఒకవేల బొగ్గు గనులు కేటాయింపు జరగకపోతే సింగరేణి తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు.

గనులు లేకపోవడం వల్లే విశాఖ స్టీల్ ప్లాంటులో పూర్తిగా కార్యకలాపాలు స్తంభించి ప్రైవేటు పరం అయ్యే పరిస్థితికి వచ్చిందని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో సింగరేణిలోకి కూడా అదే గతి పట్టబోతుందా అని ఆదోళన వ్యక్తం చేశారు. వేలాది మందికి అన్నం పెట్టే సింగరేణిని కాపాడేందుకు కేసీఆర్ అప్పట్లో వేలంలో పాల్గొనలేదని గుర్తు చేశారు. గతంలో ఆయన కేంద్రానికి లేఖ రాసి వేలంపాటను ఆపేశారని తెలిపారు. మొత్తం నాలుగు బొగ్గు గనులకు వేలం పెట్టకుండా సింగరేణికే కేటాయించాలంటూ 2021 డిసెంబర్ 11న రేవంత్‌రెడ్డి కూడా ప్రధాని నరేంద్ర మోడీకి లేఖను రాశారని గుర్తు చేశారు. అప్పుడు మాట్లాడిన ఆ మనిషే ఇప్పుడెందుకు వేలం విషయంలో స్పందించడం లేదంటూ ధ్వజమెత్తారు.

నాలుగున్నరేళ్లలో మళ్లీ తమ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ఇప్పుడు కొన్న బొగ్గు గనిని మళ్లీ వెనక్కి తీసుకుంటామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేలంపాటను ఆపాలని, రాష్ట్ర ప్రభుత్వం వేలంలో భాగస్వాములు కాకూడదని సూచించారు. సింగరేణికి బీఆర్ఎస్ రక్షణ కవచమని తాను ఊరికే అనడం లేదని అన్నారు. తొమ్మిదిన్నరేళ్ల పాలనలో కేంద్ర ప్రభుత్వం తమ మెడ మీద కత్తి పెట్టినా.. బొగ్గు గనులను వేలం వెయ్యకుండా కాపాడామని పేర్కొన్నారు. సింగరేణిని నిర్వీర్యం చేసి, బొగ్గు గనులను కార్పొరేట్ గద్దలకు కట్టబెట్టాలని చూసే ఆ ప్రయత్నాన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం కేటీఆర్ అన్నారు. EX Minister KTR, Singareni Mines, Telangana, TS Govt, Congress Party, BJP, Telugu News



Next Story