BREAKING: వర్గీకరణపై చర్చకు ప్రధాన ప్రతిపక్షం సహకరించాలి.. అసెంబ్లీలో సీఎం రేవంత్ సీరియస్

by Shiva |   ( Updated:2024-08-01 07:16:41.0  )
BREAKING: వర్గీకరణపై చర్చకు ప్రధాన ప్రతిపక్షం సహకరించాలి..  అసెంబ్లీలో సీఎం రేవంత్ సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించిన తరుణంలో అసెంబ్లీలో వర్గీకరణపై చర్చకు ప్రధాన ప్రతిపక్షం సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. వర్గీకరణ అనేది అత్యంత ప్రాధాన్యమైన అంశమని, అందరి అభిప్రాయాలు తీసుకోవాలని అన్నారు. వర్గీకరణపై ప్రతిపక్షం కూడా మాట్లాడాల్సిన అవసరం ఉందని, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కూడా చర్చలో పాల్గొని సూచనలు చేయాలన్నారు. అయితే, ఓ వైపు సీఎం మాట్లాడుతుండగానే.. వీ వాంట్.. జస్టీస్ అంటూ బీఆర్ఎస్ నాయకులు లేచి నిలబడి నినాదాలు చేశారు. ఈ క్రమంలో తమకు మైక్ ఇవ్వాలని కోరగా.. స్పీకర్ వారికి అవకాశం ఇచ్చారు. వర్గీకరణ మినహా మరే ఇతర అంశం మాట్లాడినా.. వెంటనే మైక్ కట్ చేస్తమని స్పష్టం చేశారు.

Advertisement

Next Story