- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు వెళ్లకుండా కాపాడుతోంది ఆ కాంగ్రెస్ మంత్రే : ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు వెళ్లకుండా కాపాడుతోంది ఆ కాంగ్రెస్ మంత్రేనని ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనకు పెద్దగా తేడా ఏమీ లేదని ఆరోపించారు. ఎన్నికల వేళ రిజర్వేషన్లను అడ్డుపెట్టుకుని సీఎం రేవంత్‌రెడ్డి కొత్త నాటకానికి తెర లేపిండని ధ్వజమెత్తారు. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలింగించేలా గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిందని ఫైర్ అయ్యారు. ఇప్పటికే ఆ కేసులో కొంతమంది పోలీసులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారని గుర్తు చేశారు. అంత పెద్ద కేసు ప్రస్తుతం చర్చలో లేకుండా చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసును నీరు గార్చేందుకు, కేసీఆర్ కుటుంబాన్ని కాపాడేందుకు కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ కాంగ్రెస్ మంత్రి ప్రయత్నిస్తున్నాడంటూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే మంత్రి కేసీఆర్, కేటీఆర్‌లతో లాలూచి పడి, చీకటి ఒప్పందాలు కుదుర్చుకుని ఫోన్ ట్యాపింగ్ కేసును పక్కదోవ పట్టించాడని ఆరోపించారు. మాజీ మంత్రి హరీష్ రావుకు కూడా ఫోన్ ట్యాపింగ్‌కు బాధితుడేనని, అందుకే ఆయనకు ఏడాది పాటు మంత్రి పదవి ఇవ్వలేదని గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ స్టేట్‌మెంట్‌లో కూడా కేసీఆర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశానంటూ స్టేట్‌మెంట్ ఇచ్చాడని పేర్కొన్నారు. అయినా..ఈ కేసులో ప్రభుత్వం మిన్నకుండిపోవడం ఆశ్చర్యంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ దోస్తీకి నిదర్శనం కాదా.. అని బండి సంజయ్ ప్రశ్నించారు.