BREAKING :నిజాం కాలేజీ వద్ద ఉద్రిక్తత

by Maddikunta Saikiran |
BREAKING :నిజాం కాలేజీ వద్ద ఉద్రిక్తత
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్, బషీర్ బాగ్ లోని నిజాం కాలేజీ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు.విద్యార్థుల ధర్నాతో బషీర్ బాగ్ చౌరస్తాలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విద్యార్థులు ధర్నా చెయ్యడంతో లిబర్టీ నుండి అబిడ్స్ వరకు వాహనాలు నిల్చిపోయాయి. దీంతో ఆ రూటులో వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

కాగా.. ఈ ఏడాది UG విద్యార్థులకంటే PG విద్యార్థులకే గర్ల్స్ హాస్టల్ లో ఎక్కువ అడ్మిషన్లు ఇచ్చారని యూజీ విద్యార్థులు ఆరోపించారు. కేవలం యూజీ విద్యార్థులకే గర్ల్స్ హాస్టల్ లో అడ్మిషన్లు ఇవ్వాలని రోడ్డుపై ఆందోళనలకు దిగారు.కాలేజీ యాజమాన్యం వెంటనే స్పందించి తమకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు. అయితే ఆందోళనలకు దిగిన విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చెయ్యడానికి ప్రయత్నించగా, ఇరువురి మధ్య తోపులాట జరిగింది. దీంతో కాసేపు అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది.

Advertisement

Next Story