BREAKING: ఆ పది జిల్లాల్లో డెంగీ కేసుల ప్రభావం: డీహెచ్ రవీంద్ర నాయక్ కీలక ప్రకటన

by Shiva |   ( Updated:2024-08-24 13:26:43.0  )
BREAKING: ఆ పది జిల్లాల్లో డెంగీ కేసుల ప్రభావం: డీహెచ్ రవీంద్ర నాయక్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా డెంగీ, మలేరియా, చికెన్ గున్యా, హెచ్1‌ఎన్1 వైరస్ ప్రబలుతున్నాయని డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌గా డాక్టర్‌ రవీంద్ర నాయక్‌ అన్నారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది ఇప్పటి వరకు 4,600 డెంగీ కేసులు నమోదయ్యాయని అన్నారు. అదేవిధంగా 10 జిల్లాల్లో డెంగీ కేసులు ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపారు. కేవలం ఒక్క హైదరాబాద్ జిల్లాలో 1,697 కేసులో నమోదు కాగా, సంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లోనూ ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు అయ్యాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో డెంగీ కేసుల గురించి ఆందోళనకు గురికావొద్దని.. జిల్లా్ల్లోని అధికారులతో సమన్వయం చేసుకుని తగిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇంటింటి సర్వేతో పాటు పరీక్షలు చేసి చకిత్స అందిస్తున్నామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed