బ్రేకింగ్ : రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారానికి ముఖ్య అతిథిగా సోనియా గాంధీ

by Sathputhe Rajesh |   ( Updated:2023-12-06 04:54:43.0  )
బ్రేకింగ్ : రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారానికి ముఖ్య అతిథిగా సోనియా గాంధీ
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పదేళ్ల తర్వాత అధికారం చేజిక్కించుకుంది. రేవంత్ రెడ్డిని సీఎం చేస్తున్నట్లు హైకమాండ్ ప్రకటించింది. ఇక, రేపు తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రానున్నారు. కాగా, ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జు ఖర్గేతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తన ప్రమాణ స్వీకారానికి ఖర్గేను ఆహ్వానించారు. అంతకుముందు రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత పార్లమెంట్ కి రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఇవాళ ఎంపీ పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేసే అవకాశం ఉంది.

Advertisement

Next Story