BREAKING: సిద్దిపేటలో రాజీనామా చేసి ఎన్నికలకు రావాలి: హరీశ్‌కు మైనంపల్లి సవాల్

by Shiva |
BREAKING: సిద్దిపేటలో రాజీనామా చేసి ఎన్నికలకు రావాలి: హరీశ్‌కు మైనంపల్లి సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: సిద్ధిపేట‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతూనే ఉంది. హరీశ్‌రావు రాజీనామా ఫ్లెక్సీలతో మొదలైన వివాదం ఇరు పార్టీల వారు రోడ్డెక్కి పోటాపోటీగా నిరసనలు తెలిపే స్టేజ్‌కు చేరుకున్నాయి. ఈ క్రమంలోనే మల్కాజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మాజీ మంత్రి హరీశ్‌రావుకు సంచలన సవాల్ విసిరారు. దమ్ముంటే సిద్దిపేటలో రాజీనామా చేసి ఎన్నికలకు రావాలంటూ ఓపెన్ చాలెంజ్ చేశారు. ఒకవేళ తాను ఓడిపోతే.. రాజకీయ సన్యాసం తీసుకుంటానని హనుమంత రావు కామెంట్ చేశారు. తమపై దాడి చేయించేందుకు హరీశ్ పక్కా ప్లాన్‌ వేశారని ఆరోపించారు. రాజకీయాల్లో హరీశ్ అయినా ఉండాలి.. తానైనా ఉండాలంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. హరీశ్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. ఇక సిద్దిపేటలో ఆయన మళ్లీ గెలవబోడని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల క్యాంపు ఆఫీసుల్లో అప్పటి సీఎం కేసీఆర్‌ ఫొటో ఉండేదని.. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు ఆఫీసులో సీఎం రేవంత్‌‌‌రెడ్డి ఫొటో పెట్టాలని మైనంపల్లి డిమాండ్ చేశారు.

Advertisement

Next Story