BREAKING: మేడ్చల్‌ జిల్లాలో సంచలనం.. ఇద్దరు నకిలీ వైద్యులపై కేసు నమోదు

by Shiva |
BREAKING: మేడ్చల్‌ జిల్లాలో సంచలనం.. ఇద్దరు నకిలీ వైద్యులపై కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: వైద్య వృత్తి అపహాస్యం అయిపోయింది. ట్రీ‌ట్మెంట్ కోసం వచ్చిన రోగులకు కనీస అర్హతలు లేకుండా చికిత్స చేస్తూ.. ప్రజల ఆరోగ్యాలతో కొందరు అక్రమార్కులు ఆటలాడుతున్నారు. తమ వద్ద ఎబీబీఎస్ పట్టానే లేకుండా ఏకంగా క్లినిక్‌లు ఓపెన్ చేసి అన్ని రకాల రోగాలకు చికిత్స అందజేస్తూ.. అందినకాడికి దోచుకుంటున్నారు. అచ్చం అలాంటి ఘటనే మేడ్చల్ జిల్లా పరిధిలోని చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పధిలో ఇద్దరు నకలీ వైద్యులు కొంతకాలం నుంచి క్లినిక్‌లు ఓపెన్ చేసి నడిపిస్తున్నారు. అయితే, వారిపై అనుమానం వచ్చిన రాష్ట్ర వైద్య మండలి రిజిస్ట్రార్ తనిఖీలు చేపట్టగా అసలు విషయం బయటకు వచ్చింది. ఈ మేరకు రవీందర్ రెడ్డి, నరేందర్ అనే వ్యక్తులు ఎంబీబీఎస్ అని చెప్పుకుంటూ క్లినిక్‌లను నడుతున్నట్లుగా గుర్తించారు. రాష్ట్ర వైద్య మండలి రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు వారిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed