BREAKING: ‘సబ్ కా సాత్.. సబ్ కా వికాస్’ కాదు.. దేశం సత్యనాశ్ అయింది: మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 1 |
BREAKING: ‘సబ్ కా సాత్.. సబ్ కా వికాస్’ కాదు.. దేశం సత్యనాశ్ అయింది: మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో సబ్ కా సాత్.. సబ్ కా వికాస్’ కాలేదని దేశం సత్యనాశ్ అయ్యిందని మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ నిజామాబాద్‌లో నిర్వహించిన రోడ్డు షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి నరేంద్ర మోడీ ప్రధాని అయ్యే ముందు 150 నినాదాలు చెప్పిండని.. అందులో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా నినాదాలు గాలిలో కలిసిపోయాయని ఆరోపించారు. ‘బేటీ బచావో- బేటీ పడావో’ నినాదమేమో గాని దేశంలో మహిళలు, బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. దేశానికి బీజేపీ ప్రభుత్వ చేసిందేమి లేదని.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఆకాశాన్నంటేలా సామన్యుల నడ్డి విరిచారని ఆక్షేపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నరేంద్ర మోడీ ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షల నగదు జమ చేస్తానని చెప్పాడని గుర్తు చేశారు. అయితే, నిజామాబాద్‌లో బీజేపీ ఉన్నందున ఉమ్మడి జిల్లా ప్రజలకు ఒక్కొక్కరికి రూ.30 లక్షలు జమయ్యాయట నిజమేనా అంటూ కేసీఆర్ ర్యాగింగ్ చేశారు. రాష్ట్రంలో రైతుబంధుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎగనామం పెట్టేందుకు ప్రయత్నించిందని, తాను రంగంలోకి దిగగానే రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేశారని తెలిపారు. ప్రతి ఇంట్లో ఆడబిడ్డలకు రూ.2,500 ఇస్తామని డోకాబాజీ మాటలు సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చాడని గుర్తు చేశారు. రైతులకు రూ.2 లక్షల నగదు చేసేంత సీఎం రేవంత్ రెడ్డి మెడలు వంచుతామని పేర్కొన్నారు.

Read More...

కేసీఆర్ పాల‌న‌పై ఎమోష‌న‌ల్ సాంగ్ రిలీజ్.. ప్రజలు బాగా కనెక్ట్ అవుతున్నారంట?

Next Story

Most Viewed