బ్రేకింగ్ : రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ముహుర్తం ఛేంజ్!

by Sathputhe Rajesh |   ( Updated:2023-12-06 06:22:49.0  )
బ్రేకింగ్ : రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ముహుర్తం ఛేంజ్!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రేపు (గురువారం) రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే తొలుత ఉదయం 10.28 గంటలకు ప్రమాణ స్వీకారం నిర్వహించాలని భావించారు. కాగా, రేపు మధ్యాహ్నం 1.04 గంటలకు తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేవంత్ రెడ్డితో గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక, కేసీ వేణు గోపాల్ సహా పలువురు ఏఐసీసీ నేతలను రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ప్రమాణ స్వీకారానికి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మంత్రులు హాజరుకానున్నారు. రేవంత్ ప్రమాణానికి తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు సైతం ఆహ్వానం పంపారు. ఎల్బీ స్టేడియంలో సీఎస్ శాంతి కుమారి, డీజీపీ, సీపీ చేరుకున్నారు. ప్రమాణ స్వీకార ఏర్పాట్లను, భద్రతను ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు.

Also Read...

సీఎంగా రేవంత్ రెడ్డి.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రియాక్షన్ ఇదే..!

Advertisement

Next Story