BREAKING: రేవంత్ గారు.. సీఎం పదవిని కాపాడుకోండి: కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-08-02 04:34:03.0  )
BREAKING: రేవంత్ గారు.. సీఎం పదవిని కాపాడుకోండి: కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా వెళ్లొచ్చే లోపు సీఎం సభ్యత్వమే పోయేలా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తమపై ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా సబితా ఇంద్రారెడ్డిని సీఎం, డిప్యూటీ సీఎం అవమానించారని, క్షమపణలు చెప్పమంటే ఎదురుదాడికి దిగుతున్నారని ఆరోపించారు. మాటామాటికి సీఎం రేవంత్ రెడ్డి తమ ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేస్తామని బెదిరిస్తున్నారని ఫైర్ అయ్యారు. సీఎం అమెరికా పర్యటనకు వెళ్తున్నారని, తిరిగి వచ్చేలోపు ఆయన సభ్యత్వమే పోయేలా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం లేదా నల్లగొండ నేతలు బాంబు పేల్చే అవకాశం ఉందన్నారు. చిట్‌చాట్‌లో కొందరు మంత్రులు ఈ విషయాన్ని చెబుతున్నారంటూ కామెంట్ చేశారు. ముందు రేవంత్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవాలని కౌశిక్‌రెడ్డి అన్నారు.

Advertisement

Next Story