BREAKING: రాష్ట్రంలో డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడులు.. భారీ ఎత్తున మెడిసిన్స్ సీజ్

by Shiva |
BREAKING: రాష్ట్రంలో డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడులు.. భారీ ఎత్తున మెడిసిన్స్ సీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అనుమతులు లేకుండా.. అక్రమంగా మందులు తయారు చేస్తున్న కేంద్రాలపై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులకు ఉపక్రమించారు. ఈ మేరకు ఇవాళ హైదరాబాద్, నల్లగొండ జిల్లాలో అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. శాలిబండ ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా నకిలీ లేబుల్స్‌తో ఆయిల్ తయారు చేస్తున్న ముఠాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అదేవిధంగా రోగాలు నయం అవుతాయంటూ తప్పుడు ప్రకటనలు ఇస్తున్న నల్లగొండ జిల్లా పరిధిలోని ఇర్కిగూడెం ఆర్ఎంపీ మెడికల్ షాపులో అధికారులు సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగా యాంటీ బయోటిక్స్, స్టెరాయిడ్స్, దగ్గు సిరప్ లాంటి మొత్తం 41 రకాల మెడిసిన్స్‌ను డ్రగ్ కంట్రోల్ అధికారులు సీజ్ చేశారు.

Advertisement

Next Story