బ్రేకింగ్ : పొంగులేటి ఇంటికి రాహుల్ టీమ్.. చర్చలపై తీవ్ర ఉత్కంఠ

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-17 05:50:25.0  )
బ్రేకింగ్ : పొంగులేటి ఇంటికి రాహుల్ టీమ్.. చర్చలపై తీవ్ర ఉత్కంఠ
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇంటికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ టీం రావడం హాట్ టాపిక్ గా మారింది. పొంగులేటితో 6 గంటల పాటు రాహుల్ టీమ్ చర్చించింది. పొంగులేటిని కాంగ్రెస్ పార్టీలోకి రాహుల్ టీమ్ ఆహ్వానించింది. అయితే తన మనుషులకు 10 టికెట్లు ఇవ్వాలని పొంగులేటి షరతు పెట్టినట్లు తెలిసింది. మధిర మినహా తొమ్మిది నియోజకవర్గాల్లో పొంగులేటి అనుచరులకు ప్రాధాన్యత ఉంటుందని రాహుల్ టీమ్ తెలిపినట్లు సమాచారం. తన అనుచరుడికి కంటోన్మెంట్ టికెట్ ఇవ్వాలని పొంగులేటి షరతు పెట్టినట్లు తెలిసింది. అయితే పొంగులేటి షరతులపై కాంగ్రెస్ నాయకులు సీనియర్ నాయకులు భట్టి, రేణుకాచౌదరి అసంతృప్తి వ్యక్తం చేశారు. ముందు పార్టీలో చేరాక టికెట్ల విషయం చూద్దామని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed