BREAKING: తెలంగాణ వ్యాప్తంగా ముగిసిన పోలింగ్.. అత్యధికంగా ఆ సెగ్మెంట్‌లో నమోదు

by Shiva |   ( Updated:2024-05-13 14:39:55.0  )
BREAKING: తెలంగాణ వ్యాప్తంగా ముగిసిన పోలింగ్.. అత్యధికంగా ఆ సెగ్మెంట్‌లో నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మొదట మందకొడిగా ప్రారంభమైంది. అదేవిధంగా వాతావరణం చల్లగా ఉండటంతో ఎండ నుంచి ఓటర్లు కాస్త ఉపశమనం పొందారు. ఉదయం 10 గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఒకరి వెనక మరొకరు ఓటేసేందుకు ఉత్సాహం చూపించారు. అదేవిధంగా సామాన్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు మొత్తం పోలింగ్ శాతం 61.21 నమోదైంది. అత్యధికంగా జహీరాబాద్‌లో 63.96, అత్యల్పంగా హైదరాబాద్‌లో 29.47 శాతం పోలింగ్ నమోదైంది.

ఎంపీ నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతం ఇలా..

1 Adilabad 69.81%

2 Bhongir 72.34%

3 Chevella 53.15%

4 Hyderabad 39.17%

5 Karimnagar 67.67%

6 Khammam 70.76%

7 Mahbubabad 68.40%

8 Malkajgiri 46.27%

9 Medak 71.33%

10 Nagarkurnool 66.53%

11 Nalgonda 70.36%

12 Nizamabad 67.96%

13 Peddapalle 63.86%

14 Secunderabad 42.48%

15 Warangal 64.08%

16 Sahibabad 71.91%

17 Mehaboobnagar 68.40%

17 Secunderabad (By Poll) 47.88%

Read More..

తెలంగాణ ఎంపీ ఎలక్షన్స్.. ఆ సెగ్మెంట్లలో ముగిసిన పోలింగ్


Advertisement

Next Story

Most Viewed