- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: ప్రజలు మోసపోయి కాంగ్రెస్‌ను గెలిపించిండ్రు : కాంగ్రెస్‌పై విరుచుకుపడిన కేసీఆర్
దిశ, వెబ్‌డెస్క్: ప్రజలు మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించారని.. ఆ పార్టీకి ఎందుకు ఓటేశామని ప్రజలు ఇప్పుడు ఆలోచన చేస్తున్నారని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఇవాళ ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయలేక హస్తం పార్టీ కాలయాపన చేస్తోందని అన్నారు. ఇతరులను తిడుతూ.. చేసేది పాలన కాదని హితవు పలికారు. కేసీఆర్‌ను తిట్టేందుకే ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీకి పోయిన ఎన్నికల్లో వన్ థర్డ్ సీట్లు వచ్చాయని.. ప్రజలను మమ్మల్ని ముమ్మాటికీ తిరస్కరించలేదని అన్నారు.
ఇచ్చిన హమీలు అమలు చేయకుండా ఈ రొట్టకొట్టుడు ఎందుకని కాంగ్రెస్‌పై సెటైర్లు వేశారు. బజారు భాష మాట్లడటం వేరు.. ప్రభుత్వాన్ని నడపడం వేరని కేసీఆర్ అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక చిన్న మతకల్లోలం లేకుండా రాష్ట్రాన్ని పరిపాలించామని తెలిపారు. తమ ప్రభుత్వం అప్పులు చేసిందంటూ ప్రతిపక్షాలు వాగుతున్నాయని, మన కన్నా ఎక్కువ అప్పులు అమెరికాకు ఉన్నాయని అన్నారు. ప్రజా ఆకాంక్షలను తీర్చే ప్రయత్నంలో అప్పులు అవ్వడం సహజమని తెలిపారు. అప్పులు తెచ్చుకోవడమనేది బడ్జెట్‌లో ఓ భాగమని అన్నారు. ఆర్థక పరిస్థితులపై కాంగ్రెస్‌వి అర్థం లేని ఆరోపణలని, దేశమే నెవ్వరపోయేలా తెలంగాణను అభివృద్ధి చేశామని తెలిపారు. అసెంబ్లీలో కాంగ్రెసోళ్ల ఆరోపణలు చూసి నవ్వుకున్నరు, తనను బద్నాం చేశానని వాళ్లు సంబుపడొచ్చు.. అసలు నిజాన్ని ప్రజలకు తెలియకుండా చేయలేరని కేసీఆర్ అన్నారు.
Read More...