BREAKING: ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మరే ప్రసక్తే లేదు: ఎమ్మెల్యే వివేకానంద ఆసక్తికర వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-07-15 08:50:41.0  )
BREAKING: ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మరే ప్రసక్తే లేదు: ఎమ్మెల్యే వివేకానంద ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ పరిధిలో విపత్తుల నిర్వహణ విభాగాన్ని విస్తృతం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ (హైడ్రా) ఏర్పాటు చేయబోతోంది. ఇందులో భాగంగా నగర వ్యాప్తంగా ఉన్న భారీ హోర్డింగ్స్, ఫెక్లీల తొలగింపు ఆ సంస్థ చేపడుతుంది. ఈ క్రమంలోనే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సంస్థ పేరు మార్పుపై ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద స్పందించారు. ఇవాళ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి పేర్లు మార్చడమే తప్పా ఏం పనులు చేయాలో తెలియడం లేదన్నారు. జీహెచ్ఎంసీని బీఆర్ఎస్ ప్రభుత్వం ఓ గొప్ప వ్యవస్థగా తయారు చేసిందని అన్నారు.

కొత్తగా‘ హైడ్రా’ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు మొదలు పెట్టిందని ఆరోపించారు. కొత్తగా ఏర్పడిన మునిసిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. కొత్త మునిసిపాలిటీలను అప్‌గ్రేడ్ కాకుండా సర్కార్ కుట్రలు చేస్తుందని అన్నారు. బీఆర్ఎస్ చేసిన మునిసిపాలిటీలను తొలగించే కుట్ర జరుగుతోందని ఫైర్ అయ్యారు. ‘హైడ్రా’ వెనుక ఏ లక్ష్యం లేదని.. కేవలం కుట్ర మాత్రమే ఉందని అన్నారు. ప్రభుత్వం తీసుకొస్తున్న హైడ్రాతో శివారు మునిసిపాలిటీలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే గ్రేటర్‌లో కార్పొరేషన్లు, 20 మునిసిపాలిటీలు ఉన్నాయని గుర్తు చేశారు.

రేవంత్ రెడ్డి పాలనతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పూర్తిగా పడిపోయే పరిస్థితులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడు నెలల్లో కొత్త భవనాలకు అనుమతులు ఇవ్వక.. రియల్ ఎస్టేట్ కుదలైందని వివేకానంద తెలిపారు. అదేవిధంగా తాను పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. రాష్ట్రంలో ఎవరికి రాని మెజారిటీ తనకే వచ్చిందని అన్నారు. తన నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని ఏమాత్రం ఒమ్ము చేయబోనని అన్నారు. ఇక ముందు కూడా కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తానని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మరే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇటీవలే కాంగ్రస్ పార్టీలోకి వెళ్లిన కడియం శ్రీహరిపై అనర్హత పిటిషన్ వేసింది తానే అని గుర్తు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కచ్చితంగా అనర్హత వేటు పడుతుందని వివేకానంత స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed