BREAKING: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు.. హైదరాబాద్‌లో ఢిల్లీ పోలీసుల మకాం

by Shiva |
BREAKING: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు.. హైదరాబాద్‌లో ఢిల్లీ పోలీసుల మకాం
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులకు కూడా నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ సతీష్‌తో పాటు నవీన్, తస్లీమా, గీత, విష్ణు, వంశీ‌లను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, నిన్నటి నంచి నగరంలోనే ఢిల్లీ పోలీసులు మకాం వేశారు. ఇవాళ మరో ఐపీఎస్ అధికారి కూడా హైదరాబాద్‌కు రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆ ఆరుగురు నిందితులను అరెస్ట్ చేయాలని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. అదేవిధంగా కేసుకు సంబంధించి పలు కంపూటర్లు, హార్డ్‌డిస్క్‌లు, పెన్ డ్రైవ్‌‌లను కూడా ఇప్పటికే సీజ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed