- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING : నాగార్జున సాగర్ గేట్లు ఎత్తిన అధికారులు
దిశ, నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ డ్యామ్ గేట్లు ఎత్తివేశారు. వరద పరవళ్లు తొక్కుతూ పూర్తిగా నిండిపోయే పరిస్థితి రావడంతో ఉదయం 10:57 గంటలకు నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ సీఈ నాగేశ్వరరావు ఈఈ మల్లికార్జున రావు ప్రత్యేక పూజలు నిర్వహించి మొదట 13,14 నెంబర్ క్రస్ట్ గేట్లను ఎత్తి ఆ తర్వాత మిగతా గేట్లను ఎత్తనున్నారు. అనంతరం డ్యామ్ గేట్లు ఎత్తివేశారు. ఆరు క్రస్ట్ గేట్లు ఐదడుగుల ఎత్తు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దశల వారీగా మొత్తం 14 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నామని సీఈ నాగేశ్వరరావు తెలియజేశారు. అనంతరం డ్యామ్ గేట్లు ఎత్తివేశారు. భారీ వర్షాలకు తోడు ఎగువన కర్నాటక, మహారాష్ట్ర, ఏపీలోని అన్ని ప్రాజెక్టులు పొంగి పారుతుండడంతో నాగార్జునసాగర్ డ్యామ్ కు భారీ వరద పోటెత్తుతోంది.
గత ఏడాది మాదిరే ఈసారి కూడా ఆగస్టులోనే నాగార్జున సాగర్ డ్యామ్ గరిష్ట నీటి మట్టానికి చేరుకోవడంతో గేట్లు తెరచుకున్నాయి. ఎగువన శ్రీశైలం డ్యామ్ వద్ద అన్ని గేట్లు ఎత్తేసి నాలుగు లక్షలకు పైగా వరద వదులుతున్నారు. దీంతో ఈ వరద వేగంగా సాగర్‌కు చేరుకుంటోంది. శ్రీశైలానికి ఎగువ నుంచి 4,00,491 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండటంతో.. పూర్తి సామర్థ్యం 215.60 టీఎంసీలకు.. నిల్వ 203.89 టీఎంసీలకు చేరింది. దీంతో 10 గేట్లను ఎత్తి కుడి, ఎడమ జల విద్యుత్తు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ సాగర్‌కు 4,27,711 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590అడుగుల (312.50 టీఎంసీలు) 582.00అడుగులు(287.1688టీఎంసీలు)గా నమోదైంది. సాగర్ నుంచి కుడి కాల్వ ద్వారా 5,700 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 4,613క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 26,040 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1,200 క్యూసెక్కులు.. మొత్తం 37,873 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతోంది. వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉండడంతో డ్యామ్ గరిష్ట నీటిమట్టం కొనసాగిస్తూ.. వరద ప్రవాహానికి అనుగుణంగా దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. వరద పెరిగే కొద్దీ మరికొన్ని గేట్లు కూడా ఎత్తి విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు.. మొత్తం ఆరు గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది.