- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: ఎన్‌డీఎస్ఏ బృందంతో మంత్రి ఉత్తమ్ భేటీ.. మేడిగడ్డ బ్యారేజీపై కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్టు అధ్యయనం కోసం ఎన్‌డీఎస్ఏ బృందం ఇవాళ రాష్ట్రానికి వచ్చింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని జలసౌధలో రాష్ట్ర ఇరిగేషన్ డిపార్టుమెంట్ ఆఫీసర్లు, ఇంజినీర్లతో కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన మొత్తం ఆరుగురు సభ్యులు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం ఆయన నిపుణుల కమిటీకి కాళేశ్వరంపై ప్రజెంటేషన్ ఇచ్చారు. అదేవిధంగా మేడిగడ్డ పిల్లర్లు కుంగిన అంశాలు వారికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్ అధ్యయనంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్‌డీఎస్ఏ బృందానికి పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు.
పరీక్షల కోసం అత్యాధునిక సాంకేతికతను వాడాలని బృందానికి సూచించనట్లుగా ఆయన తెలిపారు. సాధ్యమైనంత త్వరగా నివేదికను ఇవ్వాలని కోరారు. కమిటీ సలహాలు, సూచనలు పాటించి మేడిగడ్డను ఉపయోగంలోకి తీసుకోస్తామని వెల్లడించారు. వారిచ్చే రిపోర్ట్ ఆధారంగానే తదుపరి చర్యలు ఉంటాయని, ఒకవేళ తప్పులు బయటపడితే నిర్మాణ సంస్థపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బ్యారేజీలను రిపేర్ చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఎన్ఎస్‌డీఏ బృందానికి ఎవరైనా రాష్ట్ర అధికారులు సహకరించపోయినా, అదే విధంగా ప్రాజెక్టులకు సంబంధించి కీలక పత్రాలను దాచినా.. తీవ్ర పరిణామాలు ఉంటాయని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.