BIG BREAKING: పోలీసు శాఖలో కీలక పరిణామం.. సీనియర్ ఐపీఎస్‌లకు ప్రమోషన్లు

by Shiva |   ( Updated:2024-08-08 04:46:51.0  )
BIG BREAKING: పోలీసు శాఖలో కీలక పరిణామం.. సీనియర్ ఐపీఎస్‌లకు ప్రమోషన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పోలీసు శాఖలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం డీజీలుగా పదోన్నతులు కల్పిస్తూ డీజీపీ జితేందర్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఇక నుంచి డీజీ కేడర్‌ హోదాలో ఇంటెలిజెన్స్ చీఫ్‌‌గా బి.శివధర్‌రెడ్డి, హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్‌గా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి వ్యవహరించనున్నారు. అదేవిధంగా సీఐడీ డీజీగా షికా గోయల్, జైళ్ల శాఖ డీజీగా సౌమ్యా మిశ్రా, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా డీజీ హోదాలో అభిలాష బిస్త్ కొనసాగనున్నారు.

Advertisement

Next Story