BREAKING : సుప్రీం కోర్టులో కేసీఆర్ పిటిషన్ డిస్మిస్

by Rajesh |
BREAKING :  సుప్రీం కోర్టులో కేసీఆర్ పిటిషన్ డిస్మిస్
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్ గఢ్ విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణాలపై కాంగ్రెస్ సర్కారు నియమించిన నర్సింహారెడ్డి కమిషన్ చైర్మన్ ను మార్చాలని మంగళవారం సుప్రీం కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ పిటిషన్ సుప్రీం కోర్టు డిస్మిస్ చేసింది. జ్యుడీషియల్ విచారణ అనకుండా.. ఎంక్వైరీ కమిషన్ గా వ్యవహరించాలని సుప్రీం ధర్మాసనం సూచించింది. నర్సింహా రెడ్డి స్థానంలో వేరొకరిని నియమించాలని సుప్రీం కోర్టు తెలిపింది. కాగా, విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు జస్టిస్ నరసింహా రెడ్డి లేఖ రాశారు.

లేఖ కాపీని సుప్రీం కోర్టుకు న్యాయవాదులు అందించారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు స్పందిస్తూ ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే కొత్త జడ్జి నేతృత్వంలో కమిషన్ విచారణ కొనసాగించొచ్చని అభిప్రాయపడింది. వచ్చే సోమవారం లోపు కమిషన్‌కు నూతన చైర్మన్‌ను నియమిస్తామని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు ధర్మాసనానికి తెలిపింది. సోమవారం లోపు కోర్టుకు కొత్త చైర్మన్ పేరును వెల్లడిస్తామని అభిషేక్ మనుసింఘ్వీ కోర్టుకు స్పష్టం చేశారు. ఈ అంశంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆదేశించారు. కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ముగిస్తున్నట్లు సీజేఐ ప్రకటించారు.



Next Story