- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: నిలకడగా కవిత ఆరోగ్యం.. ఎయిమ్స్ నుంచి తిహార్ జైలుకు తరలింపు
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గురికాగా జైలు అధికారులు ఆమెను చికిత్స నిమిత్తం హుటాహుటిన ఎయిమ్స్‌కు తరలించారు. ఈ మేరకు జ్వరం, గొంతునొప్పితో బాధపడుతున్న ఆమెకు వైద్యులు మెడికల్ టెస్ట్‌లు చేసి అందుకు తగిన వైద్యం అందజేశారు. దీంతో కవిత ఆరోగ్యం కాస్త నిలకడగా ఉంది. నిబంధనల ప్రకారం.. జైలు అధికారులు ఆమెను శుక్రవారం ఉదయం మళ్లీ తిహార్ జైలుకు తరలించారు. మరోసారి కవిత అస్వస్థతకు గురికావడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిటెండ్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారిద్దరూ కవితను పరామర్శించేందకు ఇవాళ హస్తినకు వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు విచారణను కోర్టలు ఈనెల 28కి వాయిదా వేసింది. బుధవారం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ కొనసాగగా ఎమ్మెల్సీ కవితను తిహార్ జైలు నుంచి అధికారులు వర్చువల్‌గా హాజరుపరిచారు.