Delhi Liquor Scam : బిగ్ బ్రేకింగ్ : ఢిల్లీకి బయలుదేరిన కవిత..

by Sathputhe Rajesh |   ( Updated:2023-03-08 13:51:58.0  )
Delhi Liquor Scam : బిగ్ బ్రేకింగ్ : ఢిల్లీకి బయలుదేరిన కవిత..
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈడీ నోటీసుల నేపథ్యంలో కవిత ఢిల్లీ పయనంపై సస్పెన్స్ వీడింది. కేసీఆర్ ఫోన్‌లో ధైర్యం చెప్పడంతో ఆమె ఢిల్లీకి పయనం అయ్యారు. ఈడీ నోటీసుల నేపథ్యంలో నేరుగా ప్రగతి భవన్ వెళ్లి తన తండ్రి, సీఎం కేసీఆర్‌ను కలవాలని కవిత భావించినప్పటికీ చివరి నిమిషంలో ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా నీ కార్యక్రమాలను నువ్వు కొనసాగించాలని కవితకు సీఎం కేసీఆర్ సూచించారు.

‘ఆందోళన చెందాల్సిన పని లేదని నీ వెనుక పార్టీ సపోర్ట్ ఉంటుందని ధైర్యం చెప్పారు. బీజేపీపై న్యాయపరంగా పోరాడుదామని ఆ పార్టీ ఆకృత్యాలపై పోరు తప్పదని చెప్పారు. నీకు ఎదురయ్యే ఇబ్బందులను పార్టీ చూసుకుంటుంది’ అంటూ ఫోన్‌లో కవితకు కేసీఆర్ ధైర్యం నూరి పోశారని తెలుస్తోంది. తండ్రి మాటలతో బంజారాహిల్స్ నివాసం నుంచి కవిత నేరుగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. అయితే రేపటి విచారణకు తాను హాజరు కాలేనని ఈడీకి కవిత లేఖ రాసినప్పటికీ అధికారుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి రిప్లై రాలేదు.

దీంతో కవిత రేపటి విచారణకు హాజరుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ముందస్తుగా నిర్ణయించుకున్న కార్యక్రమం ఎల్లుండి ఉండగా ఇవాళ సాయంత్రమే ఢిల్లీకి పయనం కావడంతో ఒక వేళ విచారణ పోస్ట్ పోన్ విషయంలో అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రాకుంటే విచారణకు హాజరు అవుతారా లేదా అనేది ఆసక్తిరేపుతోంది.

Read more:

‘కవితకు ఈడీ నోటీసులు కక్షసాధింపు చర్యే’

కేసీఆర్ కుటుంబంలో ఒక వికెట్ క్లీన్ బౌల్డ్! : బండి సంజయ్

కవితకు ఈడీ నోటీసులు.. కిషన్ రెడ్డి రియాక్షన్ ఇదే!

Advertisement

Next Story

Most Viewed