BREAKING: ఇది ఒలింపిక్స్ చరిత్రలో అత్యుత్తమ క్షణాల్లో ఒకటి : కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

by Shiva |   ( Updated:2024-08-09 05:20:37.0  )
BREAKING: ఇది ఒలింపిక్స్ చరిత్రలో అత్యుత్తమ క్షణాల్లో ఒకటి : కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
X

దిశ, వెబ్‌వెస్క్: పారిస్ ఒలింపిక్స్-2024లో భాగంగా భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా జావెలిన్ త్రో విభాగంలో మరోసారి తమ సత్తా చాటాడు. టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం గెలిచిన అతడు ఈ ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. గురువారం అర్ధరాత్రి జరిగిన జావెలిన్ త్రో ఫైనల్‌లో నీరజ్ 89.45 మీటర్ల ప్రదర్శనతో రజతం దక్కించుకోగా.. పాక్ అథ్లెట్ అర్షద్ నదీమ్ 92.97 మీటర్ల దూరంలో బల్లాన్ని విసిరి ఏకంగా స్వర్ణ పతకంతో పాటు ఒలింపిక్స్ క్రీడల్లో సరికొత్త వరల్డ్ రికార్డు సృష్టించాడు. అయితే, ప్రజెంటేషన్ సెర్మనీ సందర్భంగా ఇండియన్ ప్లేయర్ నీరజ్ చోప్రా, పాక్ ప్లేయర్ అర్షద్ నదీమ్ ఒకరికొకరు కలచాలనం చేసుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఇది ఒలింపిక్స్ చరిత్రలో అత్యుత్తమ క్రీడా క్షణాల్లో ఒకటిగా నిలుస్తుంది. నీరజ్ చోప్రా, అర్షద్ నదీమ్ తమ తమ దేశాలైన భారత్, పాకిస్తాన్‌ల కోసం అవార్డులను గెలుచుకున్నారు. ముఖ్యంగా అందరి ప్రజల హృదయాలను కొల్లగొట్టారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఈవెంట్‌లో విజయం సాధించిన వారిద్దరికి అభినందనలు అంటూ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story