- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
BREAKING: రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి వెళ్లిన మంత్రి జూపల్లి
దిశ, మహబూబ్‌నగర్ బ్యూరో: కాంగ్రెస్‌లోనే కొనసాగేందుకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. గద్వాల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా తగిన ప్రాధాన్యత లేకపోవడం, అభివృద్ధి ప్రతిపాదనలకు అధిష్టానం ఆమోదం తెలుపకపోవడం తదితర కారణాలతో అనూహ్యంగా తిరిగి బీఆర్ఎస్‌లో చేరేందుకు కేటీఆర్‌తో చర్చలు జరిపిన విషయం తెలిసిందే గత రెండు రోజుల నుంచి అజ్ఞాతంతో ఉన్న బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బుధవారం రాత్రి కొత్తకోట మండల కేంద్రానికి సమీపంలో ఉన్న ఓ వ్యాపారవేత్త ఫామ్ హౌస్‌లో మంత్రి జూపల్లి, దేవరకద్ర ఎమ్మెల్యే జీఎంఆర్ సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ చర్చలతో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మెత్తబడినట్లుగా సమాచారం. కాగా, గురువారం ఉదయం జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే జీఎంఆర్ గద్వాలకు చేరుకుని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో మరోసారి మంతనాలు జరిపారు. అనంతరం వారు అందరూ కలిసి ఒకే వాహనంలో అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ బయలుదేరారు. ఇవాళ సాయంత్రం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తాను కాంగ్రెస్‌లోనే కొనసాగబోతున్నట్లు మీడియాకు తెలిపే అవకాశం ఉంది.