ఇజ్జత్ లేనోళ్లకు నేను సమాధానం చెప్పను.. ఎమ్మెల్యే అరికెపూడి మాస్ వార్నింగ్

by Shiva |   ( Updated:2024-09-12 06:43:42.0  )
ఇజ్జత్ లేనోళ్లకు నేను సమాధానం చెప్పను.. ఎమ్మెల్యే అరికెపూడి మాస్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ (Arikpudi Gandhi)కి బీఆర్ఎస్ కండువా కప్పుతానంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి (MLA Koushik Reddy) చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పొలిటికల్ హాట్‌ను పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కౌశిక్‌రెడ్డి ఇంటి ముందు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఉదయమే కౌశిక్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే గాంధీ ఇంటిపై బీఆర్ఎస్ (BRS) జెండా ఎగురవేస్తామంటూ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి.

ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటి ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మరోసారి కౌంటర్ ఇచ్చారు. ఇజ్జత్ లేని వాళ్లకు తాను సమాధానం చెప్పా్ల్సిన లేదని ఫైర్ అయ్యారు. తన ఇంటికి వస్తానని చెప్పిన కౌశిక్‌రెడ్డి ఇంకా రాలేదని.. మరికొద్దిసేపట్లో తానే కౌశిక్ ఇంటికి వెళ్తానని సవాల్ చేశారు. ఈ విషయంలో నాకు ఎవ్వరు అడ్డొచ్చినా ఆగే ప్రసక్తే లేదన్నారు.

దేశంలోనే అతిపెద్ద అసెంబ్లీ నియోజకవర్గమైన శేరిలింగంపల్లిలో తనను ప్రజలు మూడు సార్లు గెలిపించారని తెలిపారు. ఒకవేళ పార్టీ మారినా తన నియోజవర్గ ప్రజలకు సమాధానం చెప్పుకుంటానని పేర్కొన్నారు. కేసీఆర్ (BRS) పక్కన కొందరు దుర్మార్గులు చేరారని ఆరోపించారు. అలాంటి వాళ్ల వల్లే ఆయన ఎమ్మెల్యేలకు క్రమంగా దూరం అయ్యారని ధ్వజమెత్తారు. మర్యాద లేని వాళ్లను చేర్చుకుని పార్టీని భ్రష్టు పట్టించారని ఫైర్ అయ్యారు. కౌశిక్‌రెడ్డి లాంటి బ్రోకర్ వచ్చి తన ఇంటిపై జెండా ఎగరేస్తానంటే చేతులు ముడుచుకు కూర్చోలేదని మాస్ వార్నింగ్ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed