- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sridhar Babu: నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. మంత్రి శ్రీధర్‌బాబు కీలక ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: విద్య, వైద్యం, రాష్ట్రంలో నిరుద్యోగుల నిర్మూలనే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. అమెరికాలోని న్యూయార్క్‌లో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో ప్రముఖ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ తమ కొత్త సెంటర్‌ను ఏర్పాటు చేయబోతోందని ప్రకటించారు. సుమారు 10 లక్షల చదరపు అడుగల విస్తీర్ణంలో ఆ సెంటర్‌ను నెలకొల్పబోతున్నారని ప్రకటించారు. దీంతో 15 వేల మంది యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కంపెనీ ప్రతినిధులతో ఒప్పందం కూడా చేసుకున్నాని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి పరిశ్రమలు, సాఫ్ట్‌వేర్ కంపెనీలను తీసుకొచ్చేందుకు అమెరికాలో స్థిరపడిన తెలంగాణ తెలుగువారి సహాయం తీసుకుంటున్నామని అన్నారు. ఇప్పటికే ఆయా దిగ్గజ సంస్థల యజమానులను మర్యాదపూర్వకంగా కలిశామని వారితో చర్చలు పురోగతిలో ఉన్నాయని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.