- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బ్రేకింగ్: గవర్నర్ ఎఫెక్ట్.. తెలంగాణ బడ్జెట్ తేదీల్లో మార్పు..?
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2023- 2024 వార్షిక బడ్జెట్‌కు గవర్నర్ తమిళి సై ఆమోదం తెలపకపోవడంతో.. గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో తాజాగా ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. గవర్నర్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రభుత్వం సోమవారం ఉపసంహరించుకుంది. గవర్నర్ ప్రసంగంతోనే బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయని ప్రభుత్వ తరుఫు సీనియర్ లాయర్ దుష్యంత్ దవే కోర్టుకు తెలియజేశారు.
గవర్నర్ వ్యవహారంలో వెనక్కి తగ్గిన ప్రభుత్వం.. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టే తేదీని కూడా మార్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 3వ తేదీ నుండి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా.. అదే రోజు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెడతామని ప్రభుత్వ వర్గాలు మొదటి తెలిపాయి. కానీ గవర్నర్ వ్యవహారంతో అసెంబ్లీలో బడ్జెట్‌ను 3వ తేదీకి బదులుగా 6వ తేదీన ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. కాగా ఈ విషయంపై అధికారికంగా ప్రభుత్వం ప్రకటన చేసిన తర్వాత క్లారిటీ రానున్నది.