BREAKING : హైదరాబాద్‌లో గ్యాంగ్‌రేప్ కలకలం

by Rajesh |   ( Updated:2024-06-25 03:55:52.0  )
BREAKING : హైదరాబాద్‌లో గ్యాంగ్‌రేప్ కలకలం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నేరేడుమెట్‌లో గ్యాంగ్ రేప్ తీవ్ర సంచలనం సృష్టించింది. కాచిగూడ బాలికపై ఐదుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికను ట్రాప్ చేసి యువకులు నేరేడుమెట్ తీసుకెళ్లారు. బాలికకు గంజాయి తాగించి యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం విషయాన్ని తల్లికి బాధితురాలు చెప్పింది. కాచిగూడ పోలీసు‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది. నేరేడుమెట్ పీఎస్‌కు కేసును పోలీసులు బదిలీ చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story