BREAKING: మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహీల్‌కు హైకోర్టులో ఊరట.. కీలక ఉత్తర్వులు జారీ

by Shiva |
BREAKING: మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహీల్‌కు హైకోర్టులో ఊరట.. కీలక ఉత్తర్వులు జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రాహీల్‌కు హైకోర్టులో ఊరట లభించింది. అరెస్ట్‌పై రెండు వారాల పాటు కోర్టు స్టే విధిస్తూ.. కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ప్రగతి భవన్‌ వద్ద కారు ప్రమాదం కేసులో రాహీల్‌ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ప్రమాదం తర్వాత రాహిల్‌ దుబాయ్‌కు పారిపోయాడు. అతడి కోసం గత కొన్ని రోజులు గాలించిన పోలీసులు చివరికి లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే రహేల్‌ దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా.. ఏప్రిల్‌ 8న పంజాగుట్ట పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు. అనంతరం జడ్జీ ముందు హాజరు పరచగా.. ఈ నెల 22 వరకు రిమాండ్‌ విధించారు.

Advertisement

Next Story