BREAKING: ఫోన్ ట్యాపింగ్ కేసుపై తొలిసారి స్పందించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి.. ప్రణీత్ రావుపై సంచలన వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-03-26 07:27:30.0  )
BREAKING: ఫోన్ ట్యాపింగ్ కేసుపై తొలిసారి స్పందించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి.. ప్రణీత్ రావుపై సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడైన ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా కేసుకు సంబంధం ఉన్న అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. కేసులో A1గా ఉన్న అప్పటి ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికాకు పరారయ్యారు. అయితే, తాజాగా ఈ కేసుపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. ఇవాళ ఆయన హైదరాాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు.

ప్రణీత్ రావుతో తనకు ఎలాంటి పరిచయం లేదని, అయన బంధువులు తమ ఊళ్లో ఉన్నారనే విషయం మాత్రం తెలిసిందని అన్నారు. ఆయన కుటుంబం ఏ పార్టీలో ఉందో విచారణ చేస్తే తెలుస్తుందని పేర్కొన్నారు. ఆసలు ఆ కేసులోకి తననెందుకు లాగుతున్నారో తెలియట్లేదని ఎర్రబెల్లి దయార్ రావు అన్నారు. విచారణ సందర్భంగా స్వయంగా ప్రణీత్ రావే తనతో సంబంధం లేదని చెప్పాడనే స్పష్టం చేశారు. స్నేహితుల ద్వారా పార్టీ మారాలంటూ తనపై తీవ్ర ఒత్తిడి వస్తోందని, రాజకీయ కుట్రలో భాగంగానే ఇందంతా జరుగుతోందంటూ అసహనం వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. తాను పార్టీ మారబోనని స్పష్టం చేశారు. అదేవిధంగా తనపై భూ కబ్జా ఆరోపణలు చేస్తున్న శరణ్ చౌదరిపై బంజారా‌హిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసులు ఉన్నాయని ఆరోపించారు.

Read More: ఫోన్ ట్యాపింగ్ వల్లే ఆ హీరోయిన్ కు విడాకులు?.. సంచలనం రేపుతున్న ప్రణీత్ రావు టీమ్ బాగోతాలు

Advertisement

Next Story