- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: పంచ పాండవుల కథలా కాంగ్రెస్ రుణమాఫీ: మాజీ మంత్రి హరీశ్‌రావు ఘాటు వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ రుణమాఫీ పంచ పాండవుల కథలా ఉందని మాజీ మంత్రి హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల ముందు ఏకకాలంలో డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మాట తప్పారని ఆరోపించారు. అనంతరం వచ్చిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రజల నుంచి ఓట్లను రాబట్టేందుకు కనిపించిన దేవుళ్ల మీద ఇదే రేవంత్‌రెడ్డి ఒట్లు పెట్టిండని ఫైర్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ మెనిఫెస్టోలో రైతు రుణమాఫీ మొత్తం రూ.40వేల కోట్లు మాఫీ చేస్తామని చెప్పారని గుర్తు చేశారు.
అనంతరం అధికారంలోకి వచ్చి కేబినెట్ మీటింగ్ పెట్టి ఆ సంఖ్యను రూ.31వేల కోట్లకు తగ్గించారని ఆక్షేపించారు. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో రైతు రుణమాఫీకి రూ.26 వేల కోట్లే మంజూరు చేశారని, అదే విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించానని అన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా మీద అసెంబ్లీలో చర్చ పెడదామంటే అధికార పార్టీ మొహం చాటేసిందని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆగస్ట్ 15 లోగా రుణమాపీ చేస్తామని ఒట్టు పెట్టారని.. ఆయా జిల్లాల్లో ఇంకా చాలా మందికి రుణమాఫీ కాలేదని అరోపించారు. చివరికి అందరిని రుణ విముక్తులను చేస్తామని చెప్పి చేతుతెల్తేశారని ఫైర్ అయ్యారు.
రాష్ట్ర వ్యాప్తంగా 47 లక్షల మందికి రుణమాఫీ చేస్తామని చెప్పి 22 లక్షల మందికి రూ.17 వేల కోట్లు మాత్రమే మంజూరు చేశారని పేర్కొన్నారు. మళ్లీ సిగ్గులేకుండా వందిమాదులు సంకలు గుద్దుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి నోటికొచ్చినట్లుగా మాట్లాడితే సీటు గౌరవం పోదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఏకంగా 36 లక్షల మందికి రుణమాఫీ చేశామని అన్నారు. పట్టపగలు నిట్టనిలువునా రైతులను మోసం చేశారని టైమ్, ప్లేస్ చెబితే.. రైతుల వద్దకు వెళ్లే తేల్చుకుందామని హరీష్ రావు సవాల్ విసిరారు. రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణంగా రుణమాఫీ అయిందని నిరూపిస్తే.. తాను దేనికైనా సిద్ధమేనని అన్నారు.
బౌరంపేటలో 630 మంది రైతులు ఉంటే కేవలం 14 మందికి మాత్రమే రుణమాఫీ అయింది నిజం కాదా అని అన్నారు. తమకు రుణమాఫీ కాలేదంటూ తమ కాల్ సెంటర్‌కు 16,441 మంది రైతులు ఫిర్యాదు చేశారని వెల్లడించారు. రాష్ట్రంలో 46 శాతం మంది రైతులకే రుణమాఫీ అయిందని మరోసారి తెలిపారు. ఇదే రేవంత్‌రెడ్డి కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం అని చెప్పి మాట తప్పలేదా అని గుర్తు చేశారు. రైఫిల్ పట్టుకుని ఉద్యమకారులపైకి వెళ్లిన చరిత్ర మీదని.. ప్రత్యేక రాష్ట్రంలో కోసం పదవులను వదిలేసిన చరిత్ర తమదని అన్నారు. కేవలం తనను వ్యక్తిగతంగా నిందించే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రయాత్నం చేస్తున్నారని.. ఎవరి చరిత్ర ఎంటో ప్రజలకు పూర్తిగా తెలుసని హరీష్ రావు అన్నారు.