BREAKING: నిరుద్యోగులపై కాంగ్రెస్ నిర్భంధకాండ చేస్తోంది: బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు

by Shiva |
BREAKING: నిరుద్యోగులపై కాంగ్రెస్ నిర్భంధకాండ చేస్తోంది: బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో నిరుద్యోగులపై కాంగ్రస్ నిర్భంధకాండ చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్‌లో శంషాబాద్ మల్లికా కన్వేన్షన్‌లో బీజేఎల్పీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా ఆరు గ్యారంటీలను చూసి ప్రజలు మోసిపోయారని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటై డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. గ్రూప్-1 పరీక్షలపై అభ్యర్థులు ఆందోళన చేపడుతున్నా సర్కార్ పట్టించుకోకుండా వారిపై నిర్భంధకాండ చేస్తోందని ఫైర్ అయ్యారు. తెలంగాణలో ప్రజలకు బీజేపీపై విశ్వాసం పెరిగిందని అన్నారు. అసలు గ్యారంటీ మోడీదేనంటూ ప్రజలకు బలంగా నమ్ముతున్నారని అన్నారు. ఏది ఏమైనా రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వేమేనని బండి సంజయ్ తేల్చి చెప్పారు.



Next Story