BREAKING: బీఆర్ఎస్ పాలనకు జిరాక్స్ కాపీయే కాంగ్రెస్ సర్కార్: ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 1 |
BREAKING: బీఆర్ఎస్ పాలనకు జిరాక్స్ కాపీయే కాంగ్రెస్ సర్కార్: ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌‌డెస్క్: బీఆర్ఎస్ పాలనకు జిరాక్స్ కాపీయే కాంగ్రెస్ సర్కార్ అని ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఆయన నారాయణ పేట సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత తమ పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రానికి నిధులు రూపంలో రూ.లక్షల కోట్లు మంజూరు చేశామని తెలిపారు. అవన్నీ కూడా అవనీతి అనే ఏటీఎంలోకి వెళ్లిపోయాయని ఎద్దేవా చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుందని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పంథాలో దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరిట కేసీఆర్ కుటుంబం విచ్చలవిడిగా అవినీతికి పాల్పడిందని ఫైర్ అయ్యారు. అనంతరం కాంగ్రెస్ సర్కార్ కూడా ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో వసూళ్లకు పాల్పడతోందని ధ్వజమెత్తారు.

BREAKING: బీఆర్ఎస్ పాలనకు జిరాక్స్ కాపీయే కాంగ్రెస్ సర్కార్: ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలుతాను ఆర్ఆర్ ట్యాక్స్ విషయంలో ఎవరి పేరు చెప్పలేదని.. గుమ్మడికాయ దొంగ ఎవరంటే.. భుజాలు తడుముకున్నట్లుగా సీఎం రేవంత్‌రె‌డ్డి ప్రెస్ మీట్ పెట్టాడని, ఇక్కడే అసలు దొంగ బయటపడ్డాడని అన్నారు. మహబూబ్‌నగర్ ప్రాంతాన్ని బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు తమ స్వార్థ రాజకీయాలకు వాడుకున్నారని, అభివృద్ధిని మరిచారని చురకలంటించారు. పాలమూరుకు కృష్ణా, తుంగభద్ర నదుల ఆశీర్వాదం ఉందని.. సాగు నీటీ ప్రాజెక్టులకు రూ.వేల కోట్లు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదని తెలిపారు. దీంతో ఈ ప్రాంతం ప్రజలకు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారని అన్నారు. కాంగ్రెస్ రాకుమారుడు ఎన్నికలు రాగానే విద్వేషమనే విషాన్ని చిమ్ముతున్నాడని మండిపడ్డారు. రంగు ఆధారంగా ప్రజలకు విభజించేందుకు కుట్రలు చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎప్పటికీ ఒక్కటేనని.. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సీట్లు సాధించడం ఖాయమని అన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed