- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING : లిక్కర్ స్కాం కేసులో సీఎంకు బెయిల్
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ముందు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు. రూ. లక్ష పూచికత్తు, రూ. 15వేల బాండ్ సమర్పించాలని కోర్టు సీఎం కేజ్రీవాల్ కు స్పష్టం చేసింది. కాగా దర్యాప్తునకు సహకరించాలని అధికారులు పంపిన నోటీసులకు స్పందించకపోవడంతో కోర్టులో ఈడీ సీఎం కేజ్రీవాల్‌పై ఫిర్యాదు చేసింది. ఈడీ ఫిర్యాదుతో రెండుసార్లు సమన్లను రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు జారీ చేసింది. తనకు జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టును అరవింద్ కేజ్రీవాల్ కోరారు. కేజ్రీవాల్ పిటీషన్‌ను సిబిఐ ప్రత్యేక కోర్టు తోసి పుచ్చింది. కోర్టు తన విజ్ఞప్తిని పరిశీలించకపోవడంతో అరవింద్ కేజ్రీవాల్ కోర్టు ముందు శనివారం హాజరయ్యారు. మద్యం కేసు మనీ లాండరింగ్ వ్యవహారంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఇప్పటికే 8 సార్లు నోటీసులను ఈడి జారీ చేసింది. కేజ్రీవాల్‌ను తమ కస్టడీకి అప్పగించాలని కోర్టులో కోరుతున్న ఈడీ తరపు న్యాయవాదులు కోరగా అనూహ్యంగా కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరయింది.