BREAKING: బీజేపీ కిందే బీఆర్ఎస్, వైసీపీలు పని చేస్తున్నాయి.. జగ్గారెడ్డి సంచలన ఆరోపణలు

by Shiva |   ( Updated:2024-02-07 14:11:03.0  )
BREAKING: బీజేపీ కిందే బీఆర్ఎస్, వైసీపీలు పని చేస్తున్నాయి.. జగ్గారెడ్డి సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ అనే గొడుగు కిందే బీఆర్ఎస్, వైసీపీలు పని చేస్తున్నాయంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియోతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందన్న విజయసాయిరెడ్డిపై ఫైర్ అయ్యారు. బీజేపీ తరపున విజయసాయి రెడ్డి వకాల్తా ఏమైనా పుచ్చుకున్నాడా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ లాంటి మహా నాయకుడి కొడుకు జగన్ ఇంత నీచమైన దగజారుడు రాజకీయాలు చేయడం శోచనీయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదని బావ, బావమరుది హరీశ్‌ రావు, కేటీఆర్ కొత్త కుట్రలకు తెర లేపారని ఆరోపించారు. తమ పార్టీ తలుచుకుంటే ఇప్పటికిప్పుడు 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వచ్చేందకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.రానున్న రోజుల్లో ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. కాంగ్రెస్ ఐదేళ్లు అధికారంలో ఉండటం పక్కా అని అన్నారు.

Advertisement

Next Story