BREAKING: బీజేపీ త్వరలోనే రాష్ట్రంలోని ప్రభుత్వాన్ని పడగొడుతుంది: మాజీ మంత్రి ఎర్రబెల్లి సెన్సెషనల్ కామెంట్స్

by Shiva |   ( Updated:2024-04-16 10:23:57.0  )
BREAKING: బీజేపీ త్వరలోనే రాష్ట్రంలోని ప్రభుత్వాన్ని పడగొడుతుంది: మాజీ మంత్రి ఎర్రబెల్లి సెన్సెషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల వేళ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన వ్యాఖ్యలతో బాంబు పేల్చారు. ఈ మేరకు కేంద్రంలో మూడో సారి అధికారంలోకి రాబోయే బీజేపీ సర్కార్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టబోతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం తమ పార్టీ లేదని స్పష్టం చేశారు. ఇటీవలే తనపై తీవ్ర ఆరోపణలు చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ఎర్రబెల్లి సవాల్ విసిరారు. కడియంకు దమ్ము, ధైర్యం అనేవి ఉంటే రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో తలపడాలని ఛాలెంజ్ చేశారు.

ప్రస్తుత పాలిటిక్స్‌లో కడియం శ్రీహరిని మించిన ద్రోహి ఎవరూ లేరని ఆరోపించారు. కన్నతల్లి లాంటి పార్టీని, డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ లాంటి పదవులు కట్టబెట్టిన బీఆర్ఎస్ పార్టీని ఎలా మోసం చేయాలని అనిపించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కడియం శ్రీహరి చరిత్రను త్వరలోనే బయటపెడతానంటూ ఎర్రబెల్లి ఫైర్ అయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ద్వారా మరో రెండేళ్లలో ఆర్టీసీ పూర్తిగా దివాలా తీడయం ఖాయమని అన్నారు.

Advertisement

Next Story
null