BREAKING: నార్సింగి డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్.. సినీనటి రకుల్‌ప్రీత్ సోదరుడికి పాజిటివ్

by Shiva |   ( Updated:2024-07-16 05:29:24.0  )
BREAKING: నార్సింగి డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్.. సినీనటి రకుల్‌ప్రీత్ సోదరుడికి పాజిటివ్
X

దిశ, వెబ్‌డెస్క్: నార్సింగి డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. సోమవారం డ్రగ్స్‌తో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన నిందితులకు మంగళవారం ఉదయం పోలీసులు డగ్స్ నిర్ధారణ పరీక్షలు చేపట్టారు. మొత్తం ఆరుగురు నిందితులకు డగ్స్ తీసుకున్నట్లుగా పాజిటివ్ వచ్చింది. అయితే, అందులో ప్రముఖ హీరోయిన్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ కూడా ఉన్నాడు. దీంతో అమన్‌పై పోలీసులు ఎన్డీపీఎస్ యాక్ట్-27 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో ఏ-6 అతడిని చేరుస్తూ కేసు నమోదైంది. ఈ మేరకు వైద్య పరీక్షలు ముగిసిన వెంటనే మరికొద్దిసేపట్లో నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు.

కాగా, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగి పోలీస్ స్టేషన్ సర్కిల్‌లో నార్కోటిక్ బ్యూరో, ఎస్ఓటీ, నార్సింగి పోలీసుల జాయింట్ ఆపరేషన్‌ నిర్వహించారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, సైబరాబాద్ ఎస్ఓటీ, రాజేంద్రనగర్ పరిధిలోని నార్సింగి పోలీసులు హైదర్‌షా కోట్ పరిధిలోని విశాల్‌నగర్ జనాబ్ ఫోర్ట్ వ్యూ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్ నెం.202పై దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో అమ్మకానికి సిద్ధంగా ఉంచిన 199 గ్రాముల కొకైన్, 2 పాస్‌పోర్టులు, 10 సెల్‌ఫోన్లు, 2 బైకులు, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసులో ఇప్పటికే ఆరుగురు నిందితులను అరెస్ట్ చేయగా.. ప్రధాన నిదితుడైన నైజీరియాకు చెందిన డివైన్ అబుకా సుజి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

Advertisement

Next Story