- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
BREAKING: ఆర్జీవీకి బిగ్ షాక్.. వ్యూహం సినిమాకు హైకోర్టులో దక్కని ఊరట
దిశ, వెబ్‌డెస్క్: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమాపై తెలంగాణ హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఈ నెల 9లోగా సెన్సార్ బోర్డ్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేస్తూ.. ఇటీవలే సింగిల్ బెంచ్ కోర్టు తీర్పును వెల్లడించింది. అదేవిధంగా సినిమాపై సెన్సార్ బోర్డు రివ్యూ చేసి నాలుగు వారాల్లోగా రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. అయితే, హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది చిత్ర యూనిట్.
కాగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ సినిమాపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ స్వలాభం కోసం సినిమాను తెరకెక్కించారని లోకేష్ పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు.. ఈ నెల 11 వరకు విడుదలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం ఈ తీర్పును సవాల్ చేస్తూ నిర్మాత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తతం దానిపై కోర్టులో విచారణ జరుగుతోంది.
Read More..
హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి.. ఓటీటీలోకి సూపర్ హిట్ రివేంజ్ సినిమా