- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ.. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే కాలె యాదయ్య
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఘోర పరాభవాన్ని ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతూ అధినేత కేసీఆర్‌కు వరస షాకులిస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ యాదయ్యకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రజల మద్దతును కూడగట్టుకోలేకపోయింది. దీంతో ఆ పార్టీ కేవలం 39 సీట్లను సాధించి ప్రతిపక్షంలో వెళ్లింది. అదేవిధంగా అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకుని 64 సీట్లలో విజయకేతనం ఎగురవేసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
అదేవిధంగా, అనంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక్కటంటే ఒక్కసీటు కూడా సాధించకపోవడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో కలవరం మొదలైంది. కొందరు తమ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పార్టీ మారితే.. మరికొందరు తాము అధికారంలో ఉండగా కూడబెట్టిన ఆస్తులను కాపాడుకునేందుకు మళ్లీ అధికార పార్టీలోకి వెళ్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసుకునేందుకు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్‌కు తేరలేపింది. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫోకస్ పెడుతూ.. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేకుండా బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకునేందుకు రేవంత్ పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నారు.