BIG BREAKING: రామోజీరావుకు ఊహించని షాక్.. మార్గదర్శి కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు

by Shiva |
BIG BREAKING: రామోజీరావుకు ఊహించని షాక్.. మార్గదర్శి కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు
X

దిశ, వెబ్‌డెస్క్: మార్గదర్శి అక్రమాలకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విశ్వనాథన్ ద్విసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. మార్గదర్శిపై విచారణను కొట్టివేస్తూ గతంలో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. అయితే, ఇప్పటి వరకు సేకరించిన డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరగాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అందుకు తెలంగాణ హైకోర్టుకు మార్గదర్శి డిపాజిట్ల కేసు రిఫర్‌ చేస్తున్నట్లు తుది తీర్పును వెలువరించింది. అదేవిధంగా డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరగాలని వెల్లడించింది. పబ్లిక్ నోటీసు ఇచ్చి ఇంకా ఎవరైనా డిపాజిటర్లకి డబ్బు తిరిగి ఇచ్చారో లేదో తెలుసుకోవాలని సూచించింది.

అందుకు ఓ హైకోర్టు మాజీ జడ్జి ఒకరిని నియమించాలని అధికారులను కోర్టు ఆదేశించింది. ఇంకా ధర్మాసరం ఏమన్నదంటే.. ‘ఏపీలో కూడా డిపాజిటర్లు ఉన్నారు కాబట్టే అనుమతి ఇచ్చాం. అందుకే మేము తెలంగాణ హైకోర్టుకు రిఫర్ చేస్తున్నాం. రెండు మూడు నెలల్లో డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరపాలి. ఆర్బీఐ కూడా హైకోర్టు ప్రక్రియలో భాగస్వాములు కావాలి. ప్రతివాది ఉండవల్లి అరుణ్ కుమార్‌కు సహకరించాలి. తెలంగాణ, ఏపీ ప్రభుత్వం, ఆర్బీఐ, ఉండవల్లి ఈ కేసులో వాదనలు వినిపించాలి. మరో 6 నెలల్లో ఈ కేసు విచారణ తెలంగాణ హైకోర్టు పూర్తి చేయాలి. ఈ కేసుపై మేము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం. తెలంగాణ హైకోర్టులో ఇక మీ వాదనలు వినిపించండి’ అని ద్విసభ్య ధర్మాసనం తెలిపింది.

Advertisement

Next Story