- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: ముగిసిన తొలి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు.. అలాట్మెంట్ ఆర్డర్ విడుదల
దిశ, వెబ్‌డెస్క్: మొదటి విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు ముగిసింది. ఈ మేరకు అలాట్మెంట్ ఆర్డర్‌ను ఉన్నత విద్యాశాఖ అధికారులు శుక్రవారం రాత్రి విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వెబ్ ఆప్షన్లు ఇచ్చిన 95,383 మంది విద్యార్థులకు సంబంధించి మొదటి విడతలో 70,665 ఇంజినీరింగ్ సీట్లను కేటాయించారు. ఈ కేటాయింపులతో 12,001 సీట్లు 14.52 శాతం మేర భర్తీ కాకుండా మిగిలాయి. సీటు పొందిన విద్యార్థులు ఈనెల 22లోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని ఎంసెట్ కన్వీనర్ సూచించారు. కోర్సుల వారీగా తొలి విడతలో సీఎస్ఈలో 94.20 శాతం, ఈఈఈలో 58.38, సివిల్‌లో 44.76, మెకానికల్‌లో 38.50 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. 3 యూనివర్సిటీలు, 28 ప్రైవేటు కాలేజీల్లో ఇంజినీరింగ్ సీట్లు హౌజ్‌ఫుల్ అయినట్లుగా అధికారులు వెల్లడించారు. అలాట్మెంట్ ఆర్డర్ కోసం విద్యార్థులు http://tseapcet.nic.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు తెలిపారు.