- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: తాము రజాకార్లమేనని ఒప్పుకున్న అక్బరుద్దీన్: బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చాలామంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత అన్నారు. ఇవాళ ఆమె ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీజేపీ బూత్ అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మెళనంలో పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రజాకార్ల పాలన అంతం కావాలని చేసిన పోరాటంలో ఎంతోమంది చాలా నష్టపోయారని తెలిపారు. 2011లో అసదుద్దీన్ ఓవైసీ తమ్ముడు అక్బరుద్దీన్ ఓవైసీ.. తాము రజాకార్లమేనని అన్నాడంటూ ఆరోపించారు. ఎంఐఎం నేతలకు సాయం చేసే వాళ్లు తెలంగాణ బాగు గురించి కోరుకుంటున్న వాళ్లా అని ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్, ఎంఐఎంతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిందని, కానీ ఓల్డ్ సిటీ అభివృద్ధి కోసం ఆ రెండు పార్టీలు చేసింది శూన్యమని మాధవీలత అన్నారు. ప్రజల డబ్బు ప్రజలే అనుభవించాలని కోరుకునే వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ ఒక్కడేనని పేర్కొన్నారు. రూ.లక్షల కోట్ల డబ్బును ప్రజలకే ఖర్చు పెడుతున్న మహానేత మోడీ అని పొగిడారు.