- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: తెలంగాణ పీసీసీ నూతన కమిటీలను ప్రకటించిన AICC
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్‌లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో పాటుగా 26 జిల్లాల అధ్యక్షులను మార్చారు. అదేవిధంగా పొలిటికల్ ఎఫైర్స్ కమిటీకి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ సారథ్యం వహించనున్నారు. ఇప్పటి వరకు ఈ కమిటీకి షబ్బీర్ అలీ చైర్మన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అదే విధంగా తెలంగాణ ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీని ఈసారి కొత్తగా నియమించారు. టీపీసీసీ చీఫ్రేవంత్రెడ్డి చైర్మన్‌గా ఉన్న ఈ కమిటీలో సీఎల్పీ నేత భట్టి, మాజీ ఎంపీలు వీహెచ్, మధుయాష్కీ, ఎంపీ ఉత్తమ్, మాజీ మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, జీవన్‌రెడ్డి, షబ్బీర్ అలీ, జగ్గారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, అజహరుద్దీన్, కొండా సురేఖ, వేం నరేందర్‌రెడ్డి, నాగం జనార్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, సంపత్‌కుమార్, వంశీచంద్‌రెడ్డితో పాటుగా పలువురు నేతలకు అవకాశం కల్పించారు. మొత్తం ఈ కమిటీలో 40 మంది నేతలున్నారు.
అదే విధంగా ఆయా జిల్లాల అధ్యక్షులకు మార్చారు. మొత్తం 26 జిల్లాలకు కొత్త అధ్యక్షులను ప్రకటించారు. మహబూబ్‌నగర్‌కు మధుసూదన్‌రెడ్డి, యాదాద్రి భువనగిరికి అనిల్‌కుమార్‌రెడ్డి, హన్మకొండకు నాయిని రాజేందర్‌రెడ్డి, పెద్దపల్లికి రాజ్ ఠాగూర్మక్కాన్ సింగ్, రాజన్న సిరిసిల్లకు ఆది శ్రీనివాస్, సిద్దిపేటకు నర్సారెడ్డి, కరీంనగర్‌కు కవ్వంపల్లి సత్యనారాయణను నియమించారు. ఇక హైదరాబాద్ జిల్లాకు వలీయుల్లా సమీర్, ఖైరతాబాద్‌కు రోహిన్‌రెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరికి శ్రీధర్ నియమితులయ్యారు.
జిల్లా నేతలకు టీపీసీసీలో చాన్స్..
ఇప్పటి వరకు జిల్లా కమిటీల బాధ్యతలు నిర్వర్తించిన నేతలకు ఈసారి టీపీసీసీలో అవకాశం కల్పించారు. టీపీసీసీ ఉపాధ్యక్షులుగా 24 మంది, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులగా 84 మందిని నియమించారు.
పీఏసీలో 18 మంది..
టీపీసీసీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో ఈసారి 18 మందిని నియమించగా.. ప్రత్యేక ఆహ్వానితులుగా నలుగురు పీసీసీ వర్కింగ్ప్రెసిడెంట్లు ఉండనున్నారు. దీంతో టీపీసీసీ వర్కింగ్ప్రెసిడెంట్లు యధాతథంగా కంటిన్యూ అవుతున్నారు.
కోమటిరెడ్డికి ఉత్తిచేయి..
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఈ కమిటీల్లో ఎక్కడా స్థానం దక్కలేదు. ఇప్పటి వరకు ఆయన టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయన వ్యవహారం పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏఐసీసీ ప్రకటించిన కమిటీల్లో ఆయనకు చాన్స్ దక్కకపోవడంతో.. ఆయన పార్టీలో ఉంటారా.. లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.