ఏపీ ప్రజలకు జగన్‌ సర్కార్ మరో షాక్‌

by GSrikanth |   ( Updated:2023-05-30 07:53:25.0  )
ఏపీ ప్రజలకు జగన్‌ సర్కార్ మరో షాక్‌
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీ ప్రజలకు జగన్‌ సర్కారు మరో షాక్‌ ఇచ్చింది. జూన్ 1 నుండి ఏపీలో రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచుతూ జగన్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రెండోరోజు రిజిస్ట్రేషన్లకు బ్రేక్ పడింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. నిన్నటి నుంచి రిజిస్ట్రేషన్లు చేసేందుకు సర్వర్లు మోరాయిస్తుండగా....ఈరోజు కూడా అదే పరిస్థితి ఎదురుకావడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అర్థాంతరంగా ఆగిపోయింది. సర్వర్లు డౌన్ అవటంతో నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు రిజిస్ట్రేషన్లు జరగలేదు. నేడు కూడా సర్వర్లు అందుబాటులోకి రావడం కష్టమేనని అధికారులు అంటున్నారు. ఇక అటు అనంతపురం జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటకిట లాడుతున్నాయి.

అర్భన్ పరిధిలో నిన్న ఒక్క రోజే 60 రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. సాంకేతిక సమస్యతో వెబ్‌సైట్ తెరుచుకోలేదు. అధికారులు రివర్స్ ప్రింట్ రావడం లేదని ప్రక్రియను నిలిపివేశారు. జూన్ 1 నుంచి అమల్లోకి పెరిగిన మార్కెట్ ధరలు రానున్నాయి. రిజిస్ట్రేషన్లు ఛార్జీలు పెరుగుతుండడంతో కావాలనే సర్వరు ప్రాబ్లం అని చెబుతున్నారంటూ కొనుగోలు దారులు మండిపడుతున్నారు. కాగా, ప్రక్రియ మొత్తం పూర్తైపోయి ఎండార్స్‌మెంట్‌ దగ్గరకు వచ్చేసరికి ఫోటోలతో ప్రింట్‌ రాకపోవడంతో సోమవారం ఒక్క రిజిస్ట్రేషన్‌ కూడా జరగలేదు.

Advertisement

Next Story