- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పథకాలకు బ్రేకులు.. ఓటు బ్యాంకు టార్గెట్‌గా BRS బిగ్ స్కెచ్!
దిశ, తెలంగాణ బ్యూరో : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అధికార పార్టీ వ్యూహాలు రచిస్తున్నది. ఇందుకు ప్రభుత్వ పథకాలను పావులుగా వాడుకునేందుకు ప్లాన్ చేస్తున్నది. దళితబంధు, బీసీలకు, మైనార్టీలకు రూ.లక్ష సాయం, గృహలక్ష్మి సహా పలు పథకాల లబ్ధిదారుల ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి పడేలా కసరత్తు చేస్తున్నట్టు టాక్. అందులో భాగంగానే ఆయా పథకాలకు సంబంధించిన ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం ప్రస్తుతం నిలిపివేసినట్టు సమాచారం.
సరిగ్గా ఎన్నికల షెడ్యూలుకు వారం పది రోజుల ముందు ఈ పథకాల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఇప్పుడే వారికి ఆర్థిక ప్రయోజనం చేకూరిస్తే ఓటింగ్ సమయానికి వారంతా మర్చిపోతారనే భయం ప్రభుత్వానికి పట్టుకున్నది. అందుకే చెక్కుల పంపిణీని ఆలస్యం చేస్తున్నట్టు చర్చ జరుగుతున్నది. అందుకోసమే నెల రోజులుగా ఏ స్కీమ్‌కూ ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదని అధికార వర్గాల్లో టాక్.
ప్రస్తుతం లెటర్లు మాత్రమే..
ఈ ఏడాది దళిత బంధు, బీసీలకు రూ.లక్ష సాయం (బీసీ బంధు), మైనార్టీలకు రూ.లక్ష సాయం (మైనార్టీ బంధు), గృహలక్ష్మి పథకాల కింద సాయం లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఆర్థిక సంవత్సరం మొదలై ఆరు నెలలు పూర్తవుతున్నా ఇంతవరకు లబ్ధిదారులకు వాటి సాయం అందలేదు. సరిగ్గా ఎన్నికల షెడ్యూలు విడుదలకు కొద్ది రోజుల ముందు నుంచి ఎమ్మెల్యేల చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేసేందుకు సర్కారు ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. దీని వల్ల వచ్చే ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం ఎక్కువగా ఉంటుందనే ఆలోచనలో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టు తెలుస్తున్నది.
అందుకే రెండు నెలల క్రితం లబ్ధిదారుల లిస్టు రెడీ అయినా దానిని పెండింగ్‌లో పెట్టినట్టు సమాచారం. ఎవరెవరిని ఏయే స్కీమ్ కింద ఎంపిక చేశారనే విషయాన్ని లోకల్ లీడర్లకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తున్నది. కొన్ని గ్రామాల్లో గృహలక్ష్మి, బీసీ సాయం స్కీమ్స్‌కు సంబంధించి సాంక్షన్ లెటర్లు పంపిణీ చేస్తున్నారు కానీ చెక్కులు మాత్రం ఇవ్వడం లేదు. ‘మనుషులకు సహజంగా షార్ట్ మెమోరీ ఉంటుంది. ఇప్పుడు చెక్కులు ఇస్తే మరిచిపోతారు. అందుకుని ఓటింగ్ టైమ్‌కు ముందుగా ఇస్తే ప్రభుత్వం నుంచి బెనిఫిట్ పొందామని వారికి గుర్తుంటుంది. అందుకే షెడ్యూలుకు ముందు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాం.’ అని ఓ మంత్రి ప్రభుత్వ ప్లాన్‌ను వివరించారు.
2018లో ఆదుకున్న రైతుబంధు
2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతుబంధు స్కీమ్ కింద రైతుల అకౌంట్లలో ప్రభుత్వం డబ్బులు జమ చేసింది. కొందరికి డబ్బులు పడిన తర్వాత.. రైతుబంధు సాయం పేరుతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రూలింగ్ పార్టీ ప్రయత్నిస్తున్నది ఈసీకి పలువురు ఫిర్యాదు చేశారు. ఇది కొత్త స్కీమ్ కాదని, పాత స్కీమ్‌ను అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం అప్పట్లో వివరణ ఇచ్చింది. దీంతో సంతృప్తి చెందిన ఈసీ పథకం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలింగ్ రోజున ఓటు వేసే సమయంలోనే చాలా మంది రైతులకు ఖాతాలో రైతుబంధు డబ్బులు పడినట్టు వారి ఫోన్లకు మేసేజ్‌లు వచ్చాయని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు కూడా అదే తీరుగా ఎన్నికల ముందు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం వల్ల పార్టీకి ప్రయోజనం ఉంటుందని సర్కారు ఆలోచిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
విపక్షాలను, ఈసీని నిందించే ప్లాన్
ఎన్నికల షెడ్యూలుకు ముందు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం వల్ల రెండు రకాలుగా ప్రయోజనం ఉంటుందని బీఆర్ఎస్ అంచనా వేస్తున్నట్టు సమాచారం. షెడ్యూలు వచ్చిన తర్వాత ఒక వేళ పథకాల అమలును నిలిపివేయాలని విపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేస్తే, దానిని కూడా రాజకీయంగా అనుకూలంగా మల్చుకోవాలని అధికార పార్టీ భావిస్తున్నట్టు తెలిసింది. ఆన్ గోయింగ్ స్కీమ్స్‌ను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయనే సాకుతో పార్టీలపై పొలిటికల్ ఎటాక్ చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నట్టు టాక్. ఒకవేళ ఈసీ బ్రేకులు వేస్తే, ఆ నిందను ఎలక్షన్ కమిషన్‌పై మోపే అవకాశం ఉంటుందని, తాము అధికారం చేపట్టిన వెంటనే ఆ పథకాలను అమలు చేస్తామని ప్రకటించే లబ్ధి పొందాలని చూస్తున్నట్టు సమాచారం.