- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Boora: నిరుపేద ఎంబీబీఎస్ విద్యార్థినికి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ చేయూత
దిశ, తెలంగాణ బ్యూరో : సూర్యాపేట(Suryapet) జిల్లా తుంగతుర్తి మండలం(Tungaturthi Mandal)లోని వెంపటి గ్రామానికి(Vempati village) చెందిన నిరుపేద ఎంబీబీఎస్ విద్యార్థిని శిగ గౌతమి(Shiga Gautami)కి ఎన్‌డబ్ల్యూఏ ఆశ్రయ సంస్థ(NWA Shelter Organization) రూ.93 వేల ఆర్థికసాయాన్ని అందించింది. భువనగిరి మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్ఘ సభ్యుడు బూర నర్సయ్య గౌడ్(BJP National Executive Member Boora Narsaiah Goud) సైతం ఆ యువతికి చేయూతనందించారు. హైదరాబాద్(HYD) లో తన నివాసంలో ఆదివారం శిగ గౌతమికి రూ.20 వేలు ఆర్థికసాయం అందజేశారు. మరింత పట్టుదలతో చదివి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని, ఇతరులకు ఆదర్శంగా నిలవాలని అన్నారు. భవిష్యత్తులో గౌతమికి అండగా ఉంటానని బూర హామీ ఇచ్చారు. గౌతమి చిన్నతనంలోనే తల్లిదండ్రులు మృతి చెందారు. ఆమె బాగోగులను తాత శిగ రాములు, నానమ్మ చూసుకుంటున్నారు.
చిన్నతనం నుంచి సర్కారు బడిలో చదివి వైద్యురాలు కావాలనే కోరికతో నీట్ పరీక్షకు హాజరై అత్యుత్తమ ర్యాంకు సాధించింది. మంచిర్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించింది. నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థిని గౌతమి ఆర్థికంగా ఇబ్బంది ఎదుర్కొంటున్న అంశంపై ఇటీవల పత్రికల్లో కథనాలు వచ్చాయి. పేదరికం కారణంగా కాలేజీ ఫీజు, హాస్టల్ ఫీజు, పుస్తకాలు, మెస్ చార్జీల భారం పెరిగిపోయిందనే విషయాన్ని తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు తెలుసుకుని స్ఫూర్తి ఫౌండేషన్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన స్ఫూర్తి ఫౌండేషన్ గౌతమి చదువులు నిమిత్తం యూఎస్ఏకు చెందిన ఎన్‌డబ్ల్యూఏ ఆశ్రయ అనే సంస్థతో మాట్లాడి ఆదివారం ఆర్థిక సాయం అందేలా చేశారు. కాగా గౌతమికి హైదారాబాద్ లో రూ.93 వేల నగదుతో పాటు రూ.14 వేల విలువైన మొబైల్ ఫోన్, పుస్తకాలు, స్టేషనరీ అందించారు. ఎంబీబీఎస్ చదువు పూర్తయ్యే వరకు అన్ని ఖర్చులు ఎన్‌డబ్ల్యూఏ ఆశ్రయ సంస్థ భరిస్తుందని అభయమిచ్చారు.