- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Book fair: పుస్తక ప్రియులకు గుడ్ న్యూస్
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలో ఉన్న పుస్తక ప్రియులకు బుక్ ఫెయిర్ సొసైటి శుభవార్త అందించింది. డిసెంబర్ నెలలో మరోసారి మెగా బుక్ ఫెయిర్(Book fair) నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. డిసెంబర్ 19 నుంచి 29 వరకు ఎన్టీఆర్ స్టేడియం(NTR Stadium)లో బుక్ ఫెయిర్(Book fair) నిర్వహించనున్నట్లు సొసైటీ అధికారులు ప్రకటించారు. కాగా ఇందులో స్టాల్స్ ఏర్పాటు చేయాలనుకునే వారు నవంబర్ 15 లోపు దరఖాస్తు చేసుకోవాలని.. బుక్ ఫెయిర్ సొసైటీ(Book Fair Society) సభ్యులు తెలిపారు. అలాగు పుస్తక ప్రదర్శన(Book presentation) సమయాల్లో మార్పులు చేశామని తెలిపారు. గతంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రదర్శన కొనసాగగా.. ఈ సారి మాత్రం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్టాల్స్ ఓపెన్ ఉంటాయని స్పష్టం చేశారు. లక్షల పుస్తకాలు ఒకే చోట లభించే ఈ పుస్తక పండుగా 11 రోజుల పాటు జరగనుంది.